సవాయిగూడెం ఓటర్ లిస్టులో అవకతవకలు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ప్రయోజనం శూన్యం

Sakshitha news

సవాయిగూడెం ఓటర్ లిస్టులో అవకతవకలు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ప్రయోజనం శూన్యం

పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని …… బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మాణిక్యం డిమాండ్

సాక్షిత వనపర్తి
వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో
ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయని ప్రజావాణిలో 18.12.23. 30.23.24 30.8.25. తేదీలలో మూడుసార్లు కలెక్టర్ కు ఒక్కసారి కలెక్టర్ ఆర్డిఓ పంచాయతీ సెక్రెటరీ లకు దరఖాస్తు చేశాం ఇంతవరకు ఏ అధికారులు పూర్తిస్థాయిగా న్యాయం చేయలేదనీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మాణిక్యం ఆవేదనఅధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని జిల్లా అధికారులను కోరారు గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ
సవాయిగూడెం గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి మేము నాలుగు వార్డులలో పరిశీలించి చూడగా చూశాం అందులో ఒకటవ వార్డు తీసుకుంటే 1-0నెంబర్ గల ఒకే ఇంట్లో ఒక ఎస్సి ఒక ఎస్టి ఇంకో ఎస్టి ఒక ఓసి ఉంటాడు వాళ్లది ఒకటో వార్డు కూడా కాదు వాళ్లది ఎనిమిదవ వార్డు వాళ్లు ఒకటవ వార్డులో ఓటు వేస్తారు 8వ వార్డులో కూడా ఓటు వేస్తారు ఇలా ఓటు వేసేవారు సర్పంచుకు రెండుసార్లు ఓటు వేయడం జరుగుతుంది

ఇద్దరి వార్డు నెంబర్లకు ఓటు వేసే అవకాశం ఉంది నాలుగు వార్డులలో ఓట్లు వేసే వారిని పరిశీలించితే 480 మంది వారు నివసించే చోట కాకుండా వేరే ఇంటి నెంబర్లలో ఓటు కలిగి ఉన్నారు ఇలా ఇంకా ఆరు వార్డులలో పరిశీలిస్తే ఇంకా ఎంతమంది ఉంటారు మేము నాలుగు వార్డులలో సీరియల్ గా చేస్తే 13 పేపర్లు అయ్యాయి ఇలాంటి తప్పిదాలకు బిఎల్ వోలే కారకులు ఒక వర్గం వారు పెండ్లిళ్ళు అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా వారి ఓట్లు అలాగే ఉంటాయి ఇంకో వర్గం వారివి మాత్రమే బిఎల్ఓ లు తొలగిస్తున్నారు పెళ్లిళ్లు జరిగి ఎన్నో సంవత్సరాలైనా స్త్రీల వి ఓట్లు వారి భర్త ఊర్లతో పాటు సవాయిగూడెం గ్రామంలో కూడా అదేవిధంగా ఉంటున్నాయి ఇలాంటివారు 45 మంది ఉన్నారు ఇంకా వేరే గ్రామాల్లో వారి భర్తల పేర్లు తెలియక గుర్తించిన స్త్రీలు కూడా ఉన్నారు అవికాక డబల్ ఓట్లు ఉన్నవారు అదే గ్రామంలో రెండు వార్డులలో ఉన్నవారు వి కూడా 45 మందివి గుర్తించడం జరిగింది .


ఇలా ఈ ఒక గ్రామంలోనే ఈ ఊరు మారి ఇంకో ఊరికి వెళ్ళినవారు డబల్ ఓట్లు ఉన్నవారు ఈ గ్రామ స్త్రీలకు పెళ్లిళ్లు అయ్యి వేరే ఊరికి వెళ్ళిన వారివి మొత్తం 180 ఓట్లు ఉన్నాయి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఒక్క వర్గంవారికి మద్దతు ఇస్తూ ఇంకో వర్గం వారిని మభ్యపెడుతున్నారని అన్నారు ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ విచారణ చేసి ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో, సింగల్ విండో అధ్యక్షులు రఘు వర్ధన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,చిట్యాల రాము, వంశి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Scroll to Top