నవజ్యోతి హైస్కూల్ 40 సంవత్సరాల రియూనియన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
….
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్, వైఎంఎస్ కాలనీలోని నవజ్యోతి హైస్కూల్ 40 సంవత్సరాల రియూనియన్ కార్యక్రమంలో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * ముఖ్యతిధిగా పాల్గొనడం జరిగింది..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ ఉత్తమ ప్రదర్శన చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
— నవజ్యోతి హైస్కూల్ 40 సంవత్సరాల నుండి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఎంతోమంది ఉత్తములను తయారుచేసిందని కొనియాడారు..
— భావితరాల భవిష్యత్తు నాలుగు గోడల మధ్య భద్రపరిచి ఉందని కాబట్టి విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షంచారు..
ఈ కార్యక్రమంలో ఎంఎల్వో రమేష్ , ఎంఈవో జెమినీ , సిఐ గడ్డం మల్లేశ్, డైరెక్టర్ ఇందిరా , కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, అరువ శంకరయ్య గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు..

