మూలపల్లి ముత్యాలమ్మకు సారె సమర్పణ
** రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ హాజరు
సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: చంద్రగిరి మండలం భీమవరం పంచాయతీ మూలపల్లి గ్రామంలో వెలసిన
“శ్రీశ్రీ మూలపల్లి ముత్యాలమ్మ” తల్లికి యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ దంపతులు సారె సమర్పించారు. అనంతరం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఈ దేవాలయాన్ని 50 సంవత్సరాల క్రితం తమ తల్లి తండ్రులు గొల్ల ఉత్తమ్మ, కదిరప్ప యాదవ్ లు విగ్రహాలను ప్రతిష్టించి గుడి నిర్మాణం చేసారని తెలిపారు. అనంతరం
ఆ దేవాలయమును మూలపల్లి గ్రామస్తులు పునః నిర్మాణం చేసారని, దేవాలయ కుంభాభిషేకంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారికి “సారె”సమర్పించామని చెప్పారు. చివరగా ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

