జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించిన సందర్భంగా కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేశారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ చౌరస్తాలో *కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్ట్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ * జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు చేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు ప్రజాపాలనకు, సంక్షేమనికి కట్టుబడి ఉన్నారని ఋజువు చేసినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్యంలో రాష్ట్ర అభివృద్ధి గణనియంగా పెరుగుతుందన్నారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

