రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం
- ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేయవద్దు
సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం.
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సంభవించి ఒక్క ప్రాణం కూడా పోవద్దు అనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అత్యంత రద్దీ ఉండే కొత్త బస్టాండ్ వద్ద సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు, పట్టణ పోలీసులు, పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు కళాబృందం సాంస్కృతిక పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబం రోడ్డు పడుతుంది చైతన్యపరిచారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ రోజురోజుకు పట్టణంలో పెరుగుతున్న రద్దీకనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకున్నామని ప్రమాదాలు సంభవించకుండా ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నామని తెలిపారు. ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని ఇతరులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. జాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆటోవాలాలు పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేయవద్దని ప్రమాదాల బారిన పడవద్దు అని కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
