అవినీతి,ఆర్థిక నేరాలు ప్రజాభివృద్ధికి ఆటంకాలు

Sakshitha news

అవినీతి,ఆర్థిక నేరాలు ప్రజాభివృద్ధికి ఆటంకాలు

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: నేడు మన దేశ జనాభా 142 కోట్లకు మించిపోయింది. చైనా జనాభాను మించి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. 50 సంవత్సరాల క్రితం 80 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు ఇప్పుడు జనాభా పెరిగింది వ్యవసాయం పై బ్రతికే కుటుంబాల సంఖ్య తగ్గింది. వ్యవసాయం చేసే కుటుంబాలు,వ్యవసాయ కూలీలు వ్యవసాయం మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పరుగులు పెట్టేటటువంటి పరిస్థితి పెరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారు. తద్వారా యువత ఉపాధి దొరకక దొంగతనాలు, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్ వంటి తీవ్ర నేరాలలో పాలుపంచుకుంటున్నారు. కొందరు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మరోపక్క రాజకీయ నాయకులు, అధికారులు అవినీతి పతాక స్థాయికి చేరుకున్నది
దేశ ఆర్థిక ప్రగతి ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో చేరుకున్నప్పటికీ అదే స్థాయిలో ప్రజాభివృద్ధి యువత ఉపాధి రంగాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

పేదరికం

మనదేశంలో నేటికీ 73శాతం పేదరికంలోని ఉన్నారు తమ కుటుంబ అవసరాలు మినహా ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేనటువంటి జనాభా ఈనాటికి 80 శాతం మంది ఉన్నారు ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిన మన దేశంలో పేదరికం మాత్రం ఎందుకు తగ్గించలేకపోతున్నారు.

చిత్త శుద్ధి లేని రాజకీయాలు

దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా శక్తికి మించిన అప్పులు ఎందుకు ఉన్నాయి అనేది మరో ప్రశ్న దీనికి కారణాలు ఎవరు.? చిత్తశుద్ధి లేని రాజకీయాలు అధికార వ్యామోహమేనా!?
ప్రజలు కష్టపడి వారి నుండి పన్నుల రూపంలో వచ్చిన లక్షల కోట్ల రూపాయలను ప్రతి రూపాయను ప్రజల కోసమే ఖర్చు చేస్తూ ప్రజాభివృద్ధికి పాటు పడాల్సిన బాధ్యత పాలకులది, ప్రతిపక్ష పార్టీలది కానీ ఈ పార్టీ, ఆ పార్టీ అని కాకుండా అధికారం కోసం నీచ రాజకీయాలు చేస్తూ నైతిక విలువలు తుంగలో తొక్కి రాజకీయ వ్యభిచారులుగా మారి సమాజంలో నైతిక విలువలు కాలరాస్తున్నారు. ఓటు అనే ఆయుధం నేడు అంగడి సరుకులా మారింది. ప్రజలకు సేవ చేయడమే ప్రజాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి ప్రజా ప్రతినిధులు కోట్ల రూపాయలు దండుకోవడం ఆస్తులు పెంచుకోవడం అక్రమ సంపాదనతో కోటీశ్వరులుగా మారుతున్నారు. ఒకసారి ప్రజాప్రతినిధి అయిన నాయకుడు పదవి ముగిసేలోపు కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రజలు మాత్రం ఉద్యోగాలు లేక, ఉపాధి లేక పేదరికంలోనే మగ్గుతున్నారు. యువత ఉపాధి లేక పేదరికంలో మగుతుంటే కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు ప్రభుత్వ బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని వాటిని ఎగ్గొట్టిన పరిస్థితి నేడు చూస్తున్నాం. ఇది చాలదన్నట్లు కొంత మంది పారిశ్రామికవేత్తలు కేంద్ర గవర్నమెంట్ బ్యాంకు రుణం మాఫీ చేయడం కూడా మనకు అప్పుల భారం పెరగడానికి మరొక కారణం

ఆనాటి నాయకుల స్ఫూర్తి ఎక్కడ

దేశ మొదటి ప్రధాని నెహ్రూ ,శాస్త్రి,గుల్జారాల నంద, జయప్రకాష్ నారాయణ, మదన్మోహన్ మాలవ్య, పుచ్చలపల్లి సుందరయ్య, ప్రకాశం పంతులు, నర్రా రాఘవరెడ్డి సున్నం రాజయ్య, లాంటి నాయకులు ఈనాడు వెతికిన దొరకని పరిస్థితి. ఆనాటి నాయకులు తమ సొంత లాభాలను మరిచి కుటుంబ ఆదాయాలను మరిచి ప్రజాసావే లక్ష్యంగా తమ ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నాయకులు ఎందరో ఉన్నారు. మరి ఈనాటి నాయకులు ఆ స్పూర్తి, ఆ సేవా లక్షణాలు ఒక్కరిలో అయినా ఉన్నాయా? ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వెంటనే ప్రజా సమస్యలకు తీర్చకుండా ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజా సమస్యలను సరిగ్గా పట్టించుకోకుండా వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారుతున్నారు. వీరందరికీ ఇంత డబ్బు ఎక్కడిది అనేది ఒక ప్రశ్న? వీళ్ళందరూ అవినీతితో సంపాదించిన డబ్బును మొత్తం బయటకు తీసినట్లయితే మన దేశ అప్పు రూపాయి లేకుండా తీర్చవచ్చు అనేది కొంతమంది పెద్దల అభిప్రాయం. మనకు స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు అయినప్పటికీ యువత డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసి కూడా కూలీలుగా, ఆటోడ్రైవర్లుగా, లారీ డ్రైవర్లుగా అతి తక్కువ వేతనాలతో పని చేయాల్సినటువంటి పరిస్థితి. త్వరితగతిన అభివృద్ధి చెందినటువంటి దేశాలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది యువతకు ఉద్యోగ ఉపాధి సంఘాలను అభివృద్ధి చేస్తూ విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉద్యోగ రంగాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది పాలకులు చిత్తశుద్ధితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజల్లోనూ,యువతలోనూ అసంతృప్తి రగిలి బంగ్లాదేశ్ లాంటి తిరుగుబాటుబాట ఎగిరేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు

ఓటు బ్యాంకు రాజకీయాలు

ప్రజలకు అవసరమైనటువంటి విద్య ఉపాధి ఉద్యోగ సంఘాలను అభివృద్ధి చేయాల్సినటువంటి పాలకులు ఉత్పాదక రంగాలకు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులను అనుత్పాదక రంగాలకు ఖర్చు పెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని రాష్ట్రాలు అప్పుల పాలు చేస్తున్నారు. అలాగే అవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టకుండా అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతూ ఉచితాలు అందిస్తూ ఉపాధికి డబ్బులు లేక కనీసం ఖాళీగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా నింప లేనటువంటి పరిస్థితి నేటి ప్రభుత్వాలది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దివాలా తీస్తున్నాయి ప్రభుత్వ ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి ధనవంతులు మరింత ధనవంతులుగా పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. నేటికీ సొంత గూడు లేనటువంటి వారు మన దేశంలో 40శాతం మంది ఉన్నారు తమ కుటుంబం కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి వారు 60 శాతం మంది ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు ఇంకా ఎన్నాళ్లకు ఈ పరిస్థితిని దాటి ముందుకు వెళ్లగలం
త్వరిత గతిలో అభివృద్ధి చెందిన దేశాలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జపాన్, జర్మనీ,స్విట్జర్లాండ్,వియత్నం,ఐరోపా, ఇజ్రాయిల్ లాంటి దేశాలలో ఎలాంటి అభివృద్ధి జరుగుతున్నది వారి యొక్క రాజకీయ విలువలు ఎలా ఉన్నాయి అని వాటిని పాటించాల్సిన అవసరం ఉన్నది

రాజకీయ నైతిక విలువలు

దేశాన్ని పాలించే పాలకులకు నాయకులకు నైతిక విలువలు ఉన్నప్పుడు పౌరులు కూడా నైతికంగా ఉంటారు వారిలో నైతిక విలువలు లోపించినప్పుడు ప్రజల్లో కూడా నైతిక విలువలు లోపించి అక్రమాలు దోపిడీలు అత్యాచారాలు దొంగతనాలు హత్యలు ఆర్థిక నేరాలు పెరిగి సమాజాన్ని అతలాకుట్లం చేస్తాయి ప్రశాంతంగా సమాజం నిద్రపోలేనటువంటి పరిస్థితి వస్తుంది వీటిని నిర్మించాల్సినటువంటి బాధ్యత పాలకులది అధికారుల ది పౌరులకు మెరుగైన సమాజమే నిజమైన అభివృద్ధి.

అవినీతిలో రాజకీయ నాయకులు అధికారులు

నేడు ప్రజాప్రతినిధుల రాజకీయ నాయకుల సంపద పెరుగుతున్నట్లే అధికారుల సంపద కూడా విపరీతంగా పెరుగుతున్నది ప్రజల సంపదతో చదువుకున్నటువంటి మీరు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యతగా ఉద్యోగాలు చేయాల్సినటువంటి వారు అవినీతితో కోట్లకు పడగలేడుతున్నారు చిన్న ఆఫీసర్ కా నుండి పెద్ద ఆఫీసర్ వరకు చిన్న ఉద్యోగి నుండి పెద్ద ఉద్యోగి వరకు అవినీతిలో మునిగి తేలుతూ కోట్లకు పడగలేడుతున్నారు నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారులు కేవలం 10 శాతం మంది మాత్రం ఏ అధికారి మీద ఇటీవల ఏసిబి ఈ డి జి బి ఐ దాడులు చేసిన కట్టలకొద్దీ రూపాయలు గుట్టలకొద్ది బంగారం కోట్ల విలువ చేసే ఆస్తులు బయటపడుతున్నాయి ఇవన్నీ వీరికి ఎలా వచ్చాయి ఇలాంటి అవినీతి లంచగొండితనాన్ని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఎన్నటికీ నిర్మూలించగలం
నాణ్యత లేని పనులు చేస్తూ కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు దొబ్బుతూ దేశ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తున్నారు నాయకులు మరియు అధికారులు కూడా ఈరోజు వేసినటువంటి రోడ్లు నెలలు దాటకముందే కుంగిపోతున్నాయి నీటి పైపులు నెలలు దాటకముందే లీకేజీ అవుతున్నాయి భారీ ప్రాజెక్టులు సైతం కుంగిపోతున్నాయి భూ అక్రమనలు రియల్ ఎస్టేట్ దండాలు అక్రమ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ అధికారులు నాయకుల అవినీతికి తార్కాణాలు వీటిలో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఇవి ఇలాగే కొనసాగితే అప్పులకుప్పగా మారకుండా ప్రజాభివృద్ధి ఎలా సాధ్యం
వీటిని నిర్మూలించడం ఎలా? చిత్తశుద్ధితో ప్రజాభివృద్ధి కి లక్షయంగా పనిచేసే విలువలు కలిగిన పాలకులు రావాలి. అలాంటి పాలకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత పౌరుల మీద ఉన్నది అలాంటి పాలకులు వచ్చినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జీవన ప్రమాణాలు పెంచుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలి
ప్రజాధనం దుర్యోగానికి అడ్డుకట్ట వేయాలి అవినీతిపరులకు ఆర్థిక నేరాలకు ఇతర నేరాలకు పాటుపడినటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్న వారికి తక్షణ కఠిన శిక్షలు అమలు చేయాలి.
ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవి…

Scroll to Top