అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటించనున్న : మంత్రి పొంగులేటి….

Sakshitha news

అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటించనున్న : మంత్రి పొంగులేటి

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నియోజకవర్గ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఎస్టి సబ్ ప్లాన్ కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

Scroll to Top