ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజల గుండెల్లో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి.
నార్త్ రాజుపాలెం లో ఘనంగా వై.యస్.ఆర్ 77వ జయంతి వేడుకలు..
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు అధ్యక్షతన కోడవలూరు మండలం, నార్త్ రాజుపాలెం సెంటర్ లోని మహానేత వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, వైస్సార్ అభిమానుల నడుమ కేక్ కటింగ్ చేసిన. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రజల గుండెల్లో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏప్పుడు ఉన్నారని, రచ్చబండ కార్యక్రమం కు వెళుతూ హెలికాప్టర్ ప్రమాదం మరణాంతరం హైదరాబాదులో వినాయకుడి నిమజ్జనం అప్పుడు వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలను పెట్టుకున్నారు,రాష్ట్రంలో 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు భరోసా, అటువంటి ఎన్నో గొప్ప పథకాలను అందించిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డిఅనిఅన్నారు,
మహానత వెళ్తూ వెళ్తూ కోహినూరు వజ్రం వంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు అందించాడు,గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా మనల్ని ఓడించారు,లేకుంటే మరో 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే వారుఅని అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి,రాష్ట్ర అప్కాఫ్ మాజీ చైర్మన్, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు,కోడవలూరు మండల పార్టీ అధ్యక్షులు చిమటా శేషగిరి, ఎంపీపీ గాలిజ్యోతి , మాజీ సర్పంచ్ బొచ్చు సుప్రియ,మరియు వైసీపీ సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు, పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
