డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు యువతకు స్ఫూర్తి…..

Sakshitha news

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు యువతకు స్ఫూర్తి…..

125వ. జయంతి సందర్భంగా ఘన నివాళులు.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు…

–కందుల సంధ్యారాణి…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దేశ సమైక్యత కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా స్థానిక బీఎంఎస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ వాటి సంరక్షణకు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత కోసం చేసిన త్యాగాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. జమ్మూ–కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ ఐక్యత కోసం ఆయన చేసిన ఉద్యమం దేశభక్తులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

దేశాభివృద్ధి, జాతీయ సమైక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చూపిన మార్గంలో నేటి యువత ముందుకు సాగాలని ఆమె సూచించారు. భారతీయ జనతా పార్టీ దేశభక్తి, జాతీయవాద భావజాలంతో ప్రజాసేవ చేస్తూ మహనీయుల ఆశయాల సాధనకు కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, బీజేపీ సీనియర్ నాయకులు సులువ లక్ష్మీనరసయ్య, జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, బండారి శ్యామ్ పటేల్, అందే రాజ్‌కుమార్ చారి, పాకాల నరసింహారెడ్డి, పంగ రవి, బుంగ మహేష్, జక్కన బాలు, శిలారపు కళ్యాణ్, ఏరుగొండ తిరుపతి, గుండబోయిన సంతోష్, గుండబోయిన వెంకటేష్, గొడుగు సమ్మయ్య, సుంకరి సురేష్, పానుగంటి అశోక్, గడ్డం సురేష్, హనుమండ్ల వెంకటేష్, అంకరి భరత్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం ముగింపులో నాయకులు, కార్యకర్తలు కలిసి మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా వాటి సంరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

Scroll to Top