పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
సాక్షిత వనపర్తి
వనపర్తి నియోజకవర్గంరేవల్లి మండల కేంద్రానికి చెందిన టప్ప శాంతయ్యకు ఆకస్మికంగా పక్షవాతం రావడంతో ఆయనను వనపర్తి పట్టణంలోని హైందవ న్యూరో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.
ఈ విషయం తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శాంతయ్యను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబం అధైర్యపడాల్సిన అవసరం లేదని, మెరుగైన వైద్య సేవలు అందేలా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.
వైద్యపరంగా ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా తన వంతు సహాయం అందిస్తానని పేర్కొంటూ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా సెక్రెటరీ పర్వతాలు, గ్రామ సర్పంచ్ టప్ప రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
