వనపర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిద్దాం
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
సాక్షిత వనపర్తి
వనపర్తి పట్టణంలోని వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు.
వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు
ఈ బ్రహ్మోత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలుగా మాత్రమే కాకుండా, వనపర్తి పట్టణ ప్రతిష్టను చాటిచెప్పే 0మహోత్సవాలుగా నిలిచేలా అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
భక్తి భావం, సేవా తత్పరత కలిగిన పెద్దలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఉద్యోగస్తులు, అధికారులు, అనధికారులు, యువత, మహిళలు సహా ప్రతి ఒక్కరూ ఈ మహోత్సవాల్లో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యే అవకాశముందని ఎమ్మెల్యే తెలిపారు
ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం రూ.6 కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
వచ్చే మార్చిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో మనకు ఇంకా సుమారు ఏడు నెలల సమయం ఉన్నందున ప్రతి నెలా ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తూ, కార్యక్రమాలను దశలవారీగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, గతంలో ఎన్నడూ లేని విధంగా “నా భూతో న భవిష్యత్” అన్న స్థాయిలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు.
భక్తి, సంప్రదాయం, సంస్కృతి, సామూహిక సేవా భావాలకు ప్రతీకగా నిలిచే ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త రఘునాథచార్యులు, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదిరే రాములు, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

