బిఎల్ఓలు నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ..
గాజులరామవరం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో జరుగుతున్న సర్ ఓటు మ్యాపింగ్ కార్యక్రమాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఓట్ మ్యాపింగ్ ను పర్యవేక్షించారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న SIR కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని కోరారు. బిఎల్ఓలు అందజేసే ఎమ్యూనరేషన్ ఫారంలో తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు, బూతు లెవెల్ అధికారులు సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు…
అదేవిధంగా, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను గుర్తించి తొలగించేందుకు బిఎల్ఓలు కృషి చేయాలని, నకిలీ ఓట్లను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు జూలై 24వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు….
ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు…
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బుచ్చిరెడ్డి, సంతోష్ గుప్తా, యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్, సతీష్, మధుకర్, నరేష్, మారుతి, అశోక్, రవి గుప్త, రామిరెడ్డి, దేవదాస్, ఉప్పల సంతోష్,రాజు, ఆనంద్, ఉప్పల రాములు, లక్ష్మి, రజిత, రాధిక, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు…

