తాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ పండుగ వేగవంతం చేయాలని సూచించిన..…. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
సాక్షిత వనపర్తి :
జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులు రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని, నీటిపారుదల శాఖ అధికారులు అలసత్వాన్ని వీడి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నీటిపారుదల శాఖ, సర్వే శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై చర్చించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, సాగునీటి శాఖ మరియు సర్వే శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పెగ్ మార్కింగ్, సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్, ఘన్‌పూర్ బ్రాంచ్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్‌ఐ) డి-1, డి-5, డి-8 కాలువలు, బుద్దారం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌కు సంబంధించిన పెగ్ మార్కింగ్ దశలో ఉన్న పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సబ్ డివిజన్ రికార్డులను రెండు రోజుల్లో సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఎస్‌డీఆర్ (Sub Division Records) పూర్తయిన వెంటనే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ద్వారా ప్రిలిమినరీ నోటిఫికేషన్ (పీఎన్) జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రక్రియను నిర్దేశిత సమయం ప్రకారం అమలు చేస్తే భూసేకరణ పనులు వేగవంతమై ప్రాజెక్టుల పురోగతి మరింత మెరుగుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో సాధించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఇరిగేషన్ సూపరిండెంట్ ఇంజనీర్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్వే శాఖ ఏ డి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
