అక్రమ చేపల చెరువులపై కలెక్టర్ ఉక్కుపాదం…
22 అక్రమ చెరువుల కూల్చివేత.. 80 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ చేపల చెరువులను అధికారులు కూల్చివేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కూల్చివేతల ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 22 అక్రమ చేపల చెరువులను తొలగించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో ముర్మూర్ గ్రామంలో 17, సోమన్‌పల్లి గ్రామంలో 2, పొట్యాల గ్రామంలో 2, ఎల్లంపల్లి గ్రామంలో 1 చొప్పున అక్రమ చెరువులను గుర్తించి తొలగించినట్లు తెలిపారు.
ఈ చర్య ద్వారా గత ఆరు సంవత్సరాలుగా ఆక్రమణకు గురైన సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.
ఈ కూల్చివేత ప్రక్రియలో నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, మత్స్య శాఖల అధికారులు సమన్వయంతో పాల్గొన్నారని తెలిపారు.
ప్రభుత్వ భూములను అనుమతి లేకుండా ఆక్రమిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
