రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం సభ లో పాల్గొన్నవేమిరెడ్డి దంపతులు
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి “రెండేళ్ల నమ్మకం”అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్బంగా కూటమి నేతలు ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత మంత్రి నారాలోకేష్, బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా వేమిరెడ్డి దంపతులు సీఎం చంద్రబాబు నాయుడు ని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ని యువనేత నారా లోకేష్ ని ప్రత్యేకంగా కలిశారు.నెల్లూరు పార్లమెంటు పరిధిలోని పలు సమస్యలను ఎంపీ తెలిపారు.అలాగే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరునియోజకవర్గంలోని పలు ఆభివృధ్ది పనులకు సంభంధించి వారికి వివరింంచారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
