ఉపాధ్యాయుల జీతాలలో కోతలు విధించడం సమంజసం కాదు …..తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరప్రసాద్ గౌడ్
వనపర్తి :
హెల్త్ కార్డుల పేరుమీద ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించకుండానే హాస్పిటల్స్ తో సమావేశం జరుపకుండానే ఉపాధ్యాయ సంఘాలకి హెల్త్ కార్డ్స్ యొక్క నామ్స్ తెలియజేయకుండానే ఉపాధ్యాయుల నుండి వసూలు చేసే ప్రీమియం రక్షణ ఉపాధ్యాయులని మోసగించే విధంగా ఉపాధ్యాయులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారికంగా కార్డులు జారీ చేయకుండా హెల్త్ కార్డు యొక్క విధి విధానాలు విడుదల చేయకుండా ఉపాధ్యాయుల జీతభత్యాలనుండి హెల్త్ కార్డు ప్రీమియం పేరుతో జీతాలలో కోత విధించడం సమంజసం కాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ తెలియజేశారు ప్రభుత్వం ఉపాధ్యాయుల నుండి వసూలు చేసిన ప్రీమియం ని వెనుకకి పంపుతూ అధికారికంగా కార్డులు జారీ వేసిన తర్వాత విధివిధానాలు విడుదల చేసిన తర్వాత ప్రీమియం సంబంధించిన డబ్బులు జీతాల నుండి కోత విధిస్తే సరైన విధంగా ఉంటుందని తెలియజేయడమైనది ప్రభుత్వం ఈ స్కీం ఇష్టం లేని వారికి స్కీము నుండి మినహాయింపు ఇవ్వాలి భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులైనప్పుడు ఒకరి నుండి మాత్రమే ప్రీమియం వసూలు చేయాలి యువతి యువకులకి హెల్త్ కార్డు వర్తించే విధంగా 25 నుండి 35 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలి అదేవిధంగా ఒకే రకమైనటువంటి ప్రీమియమును సీనియర్ జూనియర్ తేడా లేకుండా అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రీమియం చెల్లింపు వర్తింపజేసే విధంగా విధానం ఉండాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మనోహర్, జిల్లా ఉపాధ్యక్షుడు రాములు, మోహన్ గౌడ్ జిల్లా టెక్నికల్ ఇన్చార్జ్ మల్లేష్, రవికుమార్, శ్రీనివాస్ రెడ్డి,బాల గౌడ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు
