ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం…………. బిజెపి నాయకులు మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి పెద్దిరాజు
సాక్షిత వనపర్తి :
బిజెపి బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ద్వారా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంటపల్లి పురుషోత్తం రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యా సేకరణకు గన్ని బ్యాగులు డబ్బుడం, సుత్తిలి, ధాన్యం రవాణాకు పూర్తిగా డబ్బులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ సింగిల్ విండో, ఐకెపి మరియు మెప్మా ద్వారా అధికారులను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను సమన్యాయం చేస్తూ సకాలంలో ధాన్యాన్ని తూకం వేసి దానిని సంబంధం మిల్లులకు చేర్చవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కొనుగోలు కేంద్రాలలో రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లు అందజేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులు కొనుగోలుదారుల సమన్వయం లేక రైతు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాంటా కొరకు ఎదురు చూస్తున్నారని ఈ మధ్యనే శాసనసభ్యులు మేఘా రెడ్డి ఎద్దుల బండ్లతో హంగామా సృష్టించి ర్యాలీ తీశారని ఇంకొంచెం ముందుకు వెళ్లి కాసిం నగర్ నగర్ మెట్ పల్లి నర్సింగపల్లి చిట్యాల శివారులోని మార్కెట్ వరకు అదే ఎద్దుల బండి పై కేంద్రాలకు వెళ్లి రైతులను ఆరా తీస్తే రైతన్నల తిరుగుబాటు తెలిసేదని మా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిసి ఎక్కడ కొనుగోలు కేంద్రాలకు సందర్శించడం లేదని అనుభవం అర్హత లేని అధికార పార్టీ నాయకులకు టెండర్లు ఇవ్వడం వల్లనే ధాన్యం రవాణాలో తీవ్ర జాప్యం జరిగి ఈ మధ్యలో అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసిపోయి దిక్కు తోచని స్థితిలో రైతన్న ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి 80% ధాన్యం సేకరణ జరిగిందని ప్రతిపక్షాలు కేవలం రాజకీయాలు చేస్తున్న విమర్శించడం కాంగ్రెస్ దివాలా కోరుతున్నాను నిదర్శనమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుగోసా బిజెపి భరోసా పేరుతో రైతన్నల కష్టాలను స్వయంగా పరిశీలించి మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మెట్టికాయలు వేస్తే ఆలస్యంగా నిద్రలేచిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరణ చేయకపోతే రైతన్నలతో కలిసి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి పురుషోత్తం రెడ్డి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజులు పాల్గొన్నారు.

