వనపర్తి జిల్లాలో జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లా ఐడిఓసి ఆవరణలో జూన్ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథి పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, ప్రగతి నివేదికను తన ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించనున్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
