త్యాగం, ప్రేమ, సహనం, సేవాభావానికి ప్రతీక బక్రీద్ పండుగ……ఎమ్మెల్యే మేఘారెడ్డి

Sakshitha news

త్యాగం, ప్రేమ, సహనం, సేవాభావానికి ప్రతీక బక్రీద్ పండుగ……ఎమ్మెల్యే మేఘారెడ్డి

సాక్షిత వనపర్తి :
త్యాగం, ప్రేమ, సహనం, సేవాభావానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర పండుగ బక్రీద్ పండుగ అని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు

కార్యక్రమాన్ని బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే మేఘారెడ్డి గోపాలపేట రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు

సమాజంలో సౌభ్రాతృత్వాన్ని మరింత బలోపేతం, మత సామరస్యం, పరస్పర గౌరవం మన సమాజానికి బలమైన పునాదిఅని ఎమ్మెల్యే పేర్కొన్నారు

ప్రజలందరూ కలిసికట్టుగా శాంతి, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలన్నారు

కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,, జిల్లా sp సునీత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top