రైతులపై కక్ష సాధింపు తోటే ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వ నిర్లక్ష్యం

Sakshitha news

రైతులపై కక్ష సాధింపు తోటే ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వ నిర్లక్ష్యం

పెద్ద జీతగాని అన్న ఎమ్మెల్యే జాడ ఎక్కడని ప్రశ్నించిన ……… మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

సాక్షిత వనపర్తి :
రాష్ట్రంలో సన్నకు బోనస్ అన్న ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆశపడి 65 లక్షల42 వేల ఎకరాలకు పైగా వరి సాగు చేసి కోటి 50 లక్షల మెట్రిక్ టన్ ల ధాన్యాన్ని పండించడం జరిగిందని స్వయానా ముఖ్యమంత్రి 90 శాతం ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశామని ప్రకటనలు చేయడం ఆ తర్వాత 70 శాతం కొనుగోలు చేస్తామని చెప్పడం కానీ 40 శాతం కూడా ఇప్పటికీ కొనుగోలు చేయలేదని మిగతా ధాన్యం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలలో కుప్పలు కుప్పలుగా ధాన్యం అలాగే ఉండిపోయిందని రైతులు అష్ట కష్టాలు పడి పండించిన పంటను నెలల తరబడి కొనుగోలు కేంద్రాలలో మార్కెట్లలో పడి ఉండడం తూకం చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాల కొరత ఏర్పడడంతో తూకాలు చేసేందుకు నెల కు పైగా సమయం తీసుకోగా తూకం అయినా ధాన్యాన్ని మిల్లులకు గోదాములకు తరలించేందుకు వారాల సమయం పడుతుందని ఈలోపు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతుల గోడు వర్ణనాతీతంగా మారిందని ఇదంతా ప్రభుత్వం చేతకాని తనం నిర్లక్ష్యం తోపాటురైతులపై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు ధోరణి తోటే ధాన్యము కొనుగోలు చేయటం లేదని ఇలా చేస్తే రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు వచ్చిన ధరకు అమ్ముకుంటారని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నుండి బోనస్ నుండి తప్పించుకోవచ్చు అన్న ఇది తోటే వచ్చే సాగులో వరిని సాగు చేయొద్దని నేరుగా చెప్పడం చేతకాక ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులు వారికి వారే వరి సాగు ను మానుకునే విధంగా కుట్ర చేస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలోని పెద్దమందడి గణపురం మండలాల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల గోడును ప్రత్యక్షంగా చూసి విన్న ఆయన సర్కారుపై పై విధంగా ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులు అష్ట కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మార్కెట్లకు వెళ్లి రైతులను పట్టించుకోకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు పెద్ద జీతగానని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పిన నాయకులు రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే కనపడకుండా తిరుగుతున్నారని స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రిఎదవ చేశారు. కెసిఆర్ హయాంలో వరి సాగు తో పాటు ఆయిల్ ఫామ్ సాగును ఇతర పంటల సాగుకు ప్రోత్సహించడం జరిగిందని వరి ధాన్యాన్ని నెలలోపే కొనుగోలు చేసి ధాన్యాన్ని తరలించి వారం లోపే వారి ఖాతాల్లోకి నగదు జమ చేయడం జరిగిందని నేడు కాంగ్రెస్ సర్కారు కొనుగోలు విషయంలో ఘోరంగా విఫలం చెందిందని ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని ప్రజలంతా కాంగ్రెస్కు ఓటు వేసి ఒకసారి తప్పు చేశామని

ఈసారి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఆయన జోష్యం పలికారు కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడుతూ రైతుల గోడు ను వివరిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతు వేదికలను ఉపయోగించుకుని నిలువ చేసే అవకాశాన్ని పరిశీలించాలని అలాగే లారీలు ట్రక్కులు లేని వారికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సులు ఇచ్చిన విషయంపై విచారణ జరపాలని కోరుతూనే తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కలెక్టరు కు విజ్ఞప్తి చేశారు ఆయన వెంట జిల్లా రైతు సంఘం సమితి మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య మన్యం గౌడ్ పులిందర్ పుణ్య నాయక్ ప్రతాప్ శివ లక్ష్మణ్ మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Scroll to Top