47వ. డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 47వ. డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి హాజరై మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వంలో రామగుండం నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి ఆర్థిక, సామాజికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
అలాగే 47వ. డివిజన్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేష్, మాజీ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి, మెప్మా సీఓ శ్వేత, ఆర్పీ రేఖారాణి, కాంగ్రెస్ నాయకులు సదానందం, టి.ఆర్. రఘు, యువ నాయకులు క్రాంతి, లింగయ్య, సురేష్, భీమయ్య, సంజీవ్‌తో పాటు వెన్నెల సమాఖ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
