కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల మరియు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తల ముఖ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమింపబడిన నేపథ్యంలో సిరిసిల్ల మరియు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు సన్నాహక సమావేశాన్ని సిరిసిల్ల డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది…
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ సిరిసిల్ల మరియు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి స్థానిక నాయకులకు పలు సలహాలు సూచనలు తెలియజేయడంతో పాటు గ్రామ కమిటీలు మరియు మండల కమిటీలు బలోపేతం చేయాలని అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టబోయే సర్ (SIR) Special intensive Revision కార్యక్రమం పై అవగాహన సదస్సు సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు…
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ SIR కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపు జరగకుండా చూడాలని నకిలీ ఓట్లను తొలగించే విధంగా బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి తెలియజేశారు..
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు…..
ఈ కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , సిరిసిల్ల డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ , సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జ్ కె.కె మహేందర్ రెడ్డి కోఆర్డినేటర్లు బొమ్మ శ్రీరాం మరియు ఖజా ఫక్రుద్దీన్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
