భారత ఆధునికతకు పునాది వేసిన రాజీవ్ గాంధీకి ఘన నివాళులు.. రామగుండంలో కాంగ్రెస్ నేతల స్మరణ….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి నడిపించిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రామగుండంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జీఎం కాలనీ మూలమలుపు వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ మహంకాళి స్వామి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. భారత యువతకు కొత్త అవకాశాలను కల్పించి, సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి బాటలు వేసిన దూరదృష్టి నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు.
బీసీ విభాగం కార్పొరేషన్ అధ్యక్షులు, కార్పొరేటర్ గట్ల రమేష్ మాట్లాడుతూ, దేశాన్ని ఆధునికీకరణ దిశగా నడిపించిన మహానేత రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. సాంకేతిక విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు ధూళికట్ట సతీష్, మాటూరి సత్యప్రసాద్, నాయకులు గడ్డం శ్రీనివాస్, గంగ శ్రీనివాస్, బెంద్రం రాజిరెడ్డి, కల్వల రంజిత్, ఈదునూరి హరిప్రసాద్, ఓదెలు యాదవ్, బాలరాజ్ కుమార్, అనుమ సత్యనారాయణ, కనుకుంట్ల అశోక్, శరత్ తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
