గురిజవోలులో ‘వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్’: ఇంచార్జి కలెక్టర్ పర్యటన

Sakshitha news

గురిజవోలులో ‘వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్’: ఇంచార్జి కలెక్టర్ పర్యటన

సాక్షిత నాదెండ్ల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం గురువారం నాదెండ్ల మండలం గురిజవోలులో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ పాల్గొని, ప్రజల నుండి రెవెన్యూ మరియు సర్వే సంబంధిత అర్జీలను స్వీకరించారు.

అనంతరం ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఫిర్యాదులను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించేందుకే ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. అందిన 11 అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్డీవో బాలకృష్ణ, జిల్లా సర్వే అధికారి భాను కీర్తి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top