కోవూరు శివార్లలో జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ ఆకస్మిక తనిఖీ.

Sakshitha news

​పెట్రోల్ కొరత లేదు – వదంతులు నమ్మవద్దు*

కోవూరు శివార్లలో జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ ఆకస్మిక తనిఖీ.

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి.

కోవూరుపెట్రోల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. కోవూరు శివార్లలోని జాతీయ రహదారిపై గల చౌదరి పెట్రోల్ బంకును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్న నిల్వలను మరియు రికార్డులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెట్రోల్ కొరత ఉందని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని కేవలం కొందరు కావాలనే ఇటువంటి వదంతులను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు భయంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు రావడంతో రోజువారీ కంటే రెట్టింపు వ్యాపారం జరుగుతోందని అనవసరపు రద్దీ వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ​

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఇంధన సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరి కంగారు పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని ఆమె ప్రజలకు ధైర్యం చెప్పారు.

Scroll to Top