మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..
సాక్షిత : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక… మన గులాబీ జెండా..! అలుపెరుగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా.. అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా..! ఎత్తిన జెండాను దించకుండా పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ .
దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటలను గమ్యానికి చేర్చిన తెలంగాణ ఆస్తిత్వం బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అందరికీ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ ప్రెసిడెంట్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళా నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

