పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

Sakshitha news

పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: తహసిల్దార్ కార్యాలయంలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతనకల్ తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించినారు. సాదా బైనమా దస్తావేజులు క్రమబద్ధీకరణ ఫైల్స్ అన్నింటిని పారదర్శకంగా పూర్తి చేయుటకు ప్రతి లబ్ధిదారుని ఫైలు సమగ్రంగా విచారణ చేసి భూభారతి చట్టం- 2025 మరియు తదుపరి వచ్చిన జీవోల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సర్వే మరియు సరిహద్దుల చట్టం, 1923 ప్రకారం రీ సర్వే మండలంలోని తొమ్మిది గ్రామాలలో నిర్వహిస్తున్నందున సీలింగ్ భూమిలో దీర్ఘకాలంగా అనుభవదారుగా ఉండి కొనుగోలు చేసిన రైతులందరికీ పట్టాలు మంజూరీ చేయుటకు ప్రభుత్వ ఆదేశముల ప్రకారం వెంటనే రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయవలెనని కలెక్టర్ అన్నారు.

శ్రీరామ ఎల్లమ్మ, భర్త నరసయ్య ఎర్ర పహాడ్ గ్రామ వాసి 2009 లో సర్వే నెంబరు 92 లో ఎకరం భూమిని కొనుగోలు చేసి సాదా బైనమా దస్తావేజు క్రమబద్ధీకరణ కొరకు 2020 లో దరఖాస్తు చేసుకున్నారు. కనబడదీకరణ క్రమబద్ధీకరణ ఫైలు పెండింగ్ లో ఉన్నందువలన తహసిల్దారు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ని కలవగా వెంటనే ఆమె ఫైలు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయుటకు సిబ్బందిని ఆదేశించినారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top