మధుర చారిటబుల్ ట్రస్ట్ మరియు కిమ్స్ హాస్పిటల్,సాయి జ్యోతి, కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాగిడి లక్ష్మారెడ్డి
270 మెగా క్యాంపు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం మదర్ థెరిసా మెమోరియల్ హై స్కూల్ న్యూ భవాని నగర్ మల్లాపూర్ లో నిర్వహించారు. భారీ ఎత్తున ఈ హెల్త్ క్యాంపులో మల్లాపూర్ డివిజన్ వాసులు పాల్గొన్నారు..
గత 25 సంవత్సరాలుగా మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల్ నియోజకవర్గం లో అనేక రకాల ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న రాగిడి లక్ష్మా రెడ్డి ..
ఈ మెగా క్యాంప్ లో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆప్తమాలజీ,విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.
కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు మధుర చారిటబుల్ ట్రస్ట్ వారు సొంత ఖర్చుతో ఉచితంగా ఉప్పల్ నియోజకవర్గం ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తున్న మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాగిడి లక్ష్మారెడ్డి *
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాగిడి లక్ష్మారెడ్డి * మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం లో అన్ని డివిజన్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని, మా ఈ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పన ధ్యేయంగా కుట్టుమిషన్లు, అల్లికలు, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమానాలు విదేశీ చదువులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన ధ్యేయంగా మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ వారికి ఉద్యోగాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలియజేశారు.
పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ప్రతిసారి సహకారం అందిస్తున్న మధుర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులుకు కిమ్స్ హాస్పిటల్ మరియు సాయి జ్యోతి కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి ,రిజ్వాన్,వంజరి సంతోష్, మరియు మధురా చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ రాగిడి రిహాన్ రెడ్డి డివిజన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

