స్వర్ణరథంపై శ్రీ మలయప్ప కటాక్షం
సాక్షిత ప్రతినిధి – తిరుమల: శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి – భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారి కరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

