నగర సుందరీకరణే లక్ష్యంగా ముందడగు వేస్తున్న, నగర మేయర్ మహంకాళి స్వామి…..

Sakshitha news

నగర సుందరీకరణే లక్ష్యంగా ముందడగు వేస్తున్న, నగర మేయర్ మహంకాళి స్వామి…..

సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: . నగర సుందరీకరణే లక్ష్యంగా మురుగు నీటి కాలువలను శుభ్రం చేయించే పనిలో రామగుండం నగర నగర మేయర్ మహంకాళి స్వామి నిమగ్నమయ్యారు.

నీటి సరఫరా పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తు పైప్ లైన్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ పూర్తి చేయించిన మేయర్, అదే తరహాలో మురుగు నీటి కాలువలో పూడిక తొలగింపు పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు.

తెల్లవారు ఝాముననే కార్యరంగం లోకి దిగారు . నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ప్రదాన రహదారి వెంబడి పారుతున్న పెద్ద మురుగు నీటి కాలువలో జె సి బి యంత్రం సహాయంతో పూడిక తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు.

క్షేత్ర స్థాయిలో దగ్గరుండి సిబ్బందికి మార్గదర్శనం చేస్తూ కాలువ శుభ్రం చేయించారు. తొలగించిన పూడికను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ ద్వారా తరలించే ఏర్పాట్లు చేయించారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను తొలగించడంలో కాలువ సాఫీగా ప్రవహిస్తున్నది.

Scroll to Top