రామాలయం ఆవరణలో 2 కోట్లతో కళ్యాణ మండపం ఏర్పాటు…
కోల్ బెల్టులో ఆలయాలకు కొత్త రూపురేఖలు…
ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ …

….
సాక్షిత పెద్దపల్లి//రామగుండం: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్- మనాలి ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
ఆలయంలో ఉన్న సీతారామ లక్ష్మణ స్వాముల ఉత్సవ విగ్రహాలను ఒక వేదికపై ఏర్పాటు చేసి, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, నగర మేయర్, సింగరేణి జిఎం లలిత్ కుమార్ దంపతులు, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కోదండ రామాలయం ఆవరణలో 2 కోట్ల నిధులతో కల్యాణ మండపం నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా దానిని తీర్చిదిద్దుతామన్నారు. కోట్లాది రూపాయల నిధులతో నగరాన్ని సుందరీకరణ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక నగరంగా ఏర్పాటు చేస్తానని, ఇదే క్రమంలో హనుమాన్ జంక్షన్ బి. పవర్ హౌస్ వద్ద భారీ హనుమంతుని విగ్రహం ఏర్పాటు, సమ్మక్క జాతర ఆవరణలో సకల సదుపాయాలు కల్పించామన్నారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
