రాంపల్లి గ్రామంలో సైబర్ మోసాలు,రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం

Sakshitha news

రాంపల్లి గ్రామంలో సైబర్ మోసాలు,రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం…

సాక్షిత పెద్దపల్లి : గ్రామీణ ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి నేరాలను నివారించేందుకు పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మల్లేశ్ ఆధ్వర్యంలో… రాంపల్లి గ్రామంలో సైబర్ మోసాలు,రోడ్డు భద్రత, రాష్ & నెగ్లిజెంట్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సీఐ మాట్లాడుతూ… ప్రజలు పోలీసులతో సహకరిస్తూ చట్టాలను పాటిస్తే నేరాలను సమర్థవంతంగా తగ్గించవచ్చని తెలిపారు.

గ్రామస్థులకు సైబర్ నేరాల నుండి ఎలా జాగ్రత్తపడాలి, అనుమానాస్పద ఫోన్ కాల్స్,ఓటీపీలు, లింకులు ఇతరులతో పంచుకోకూడదని, అదే విధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించడం,హెల్మెట్ వినియోగం,అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.

గ్రామంలో మద్యపానం నిషేధం అమలు చేయాలని,బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.గ్రామ అభివృద్ధి, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పోలీసులు అభినందించారు.

రాంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా మద్యపాన నిషేధం అమలు చేయడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సీఐ కోరారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మల్లేశ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీడీఓ, పీహెచ్‌సీ డాక్టర్, పోలీస్ సిబ్బంది మరియు సుమారు 200 మంది గ్రామస్థులు పాల్గొన్నారు.

Scroll to Top