దూదియా తండలో 287 వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు.
సాక్షిత ;
చిలుకూరు మండలం దూదియతండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో
సర్పంచ్ శ్రీమతి లావూరి రమాదేవి శ్రీనివాస్ మరియు పాలక వర్గం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా
లంబాడీల ఆరాధ్య దైవం, గోర్ జాతి దేవుడు. శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకొనైనది.
అలాగే.భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించడమైనది.
ఈ జయంతిని ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ.
సేవాలాల్ మహారాజ్ చూపిన దారిలో నడవాలని.బంజారా జాతి ఆచార, అలవాట్లు, సంప్రదాయాలు, కట్టుబాట్లను ప్రతిఒక్కరు పాటించాలని. మన జాతి పండుగలను విధిగా జరుపుకోవాలని కోరడమైనది. అలాగే సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉప సర్పంచ్ కొర్ర సురేష్, వార్డు సభ్యులు విజయరాంభాస్కర్, సౌజన్యబాలాజీ, రమణి, సాయికుమార్, ఆర్టీసీపోలీసు కృష్ణ, మాజీ ఎంపీటీసీ కృష్ణ చైతన్య, మాజీ వార్డు మెంబర్ సత్యావతిబాలు, భీమ్లాల్, రాజు, బాలు, సక్రియా, లచ్చు, గుగులోతు శివప్రజలకు మరియు సిబ్బంది వారికి అందరికీ పేరుపేరునా మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY