శంకర్‌పల్లి వాసవి ఒకేషనల్ కళాశాలలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్
శంకర్‌పల్లి సాక్షిత : శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలోని బివిఆర్ వాసవి ఒకేషనల్ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ రామచందర్, కరస్పాండెంట్ ప్రియాంక రెడ్డి, అధ్యాపక బృందం హాజరయ్యారు. ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సత్ప్రవర్తనతో కూడిన విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత శిఖరాల అధిరోహించాలని కోరారు. ఈ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఘనమైన కీర్తిని ఈ కళాశాలకు అందించారని మంచి మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కళాశాలగా పేరు నిలబెట్టారని కొనియాడారు. మంచి నైపుణ్యత కలిగిన అధ్యాపక బృందం మన కళాశాలలో ఉందని, మంచి ప్రశాంతమైన వాతావరణంతో కళాశాల ప్రాంగణం ఉందని తెలిపారు.
పూర్వ విద్యార్థులాగానే ఈ బ్యాచ్ విద్యార్థులు కూడా సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకొని మంచి మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన సిద్ధార్థ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుజిత రెడ్డి, గాయత్రి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హారిక హాస్పిటల్స్ ఎండి డాక్టర్ హారిక మాట్లాడుతూ మన జీవితం మన చేతిలోనే ఉందని తెలియజేస్తూ విద్యార్థుల అందరూ కూడా ఉన్నత స్థితికి ఎదగాలని అన్నారు. కళాశాల యాజమాన్యం డాక్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. క్రీడల్లో కాలేజీలో ఉత్తమ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు డాక్టర్లు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో లిటిల్ స్టార్ స్కూల్ కరస్పాండెంట్ సంజీత్ కుమార్ పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY