రామగుండం నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ
అసోసియేషన్ అధ్యక్షులు నాగుల మల్యాల రాజమౌళి చార్యులు ఘన సన్మానం….
సాక్షిత పెద్దపల్లి / రామగుండం నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుల మల్యాల రాజమౌళి చార్యులు ఆధ్వర్యంలో నగర మేయర్ మహంకాళి స్వామి,50వ. డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ ల సన్మానం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా నగర మేయర్ మహంకాళి స్వామి, 50వ. డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ శాలువాలతో సత్కరించి, సంఘం తరఫున ఘనంగా అభినందించారు.
అనంతరం వోపా సంఘం వార్షిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వోపా సంఘం ప్రధాన కార్యదర్శి పానుగంటి స్వామి, ఆర్థిక కార్యదర్శి పానుగంటి మారుతి, ఉపాధ్యక్షులు కత్రోజు మోహన్ బాబు, సంయుక్త కార్యదర్శి పొడిశెట్టి శంకరాచారి, ముఖ్య సలహాదారులు పూసాల సదానంద చారి, న్యాయ సలహాదారులు మంచోజు స్రవంతి, సలహాదారులు మంచోజు బ్రహ్మచారి, కార్యవర్గ సభ్యులు పానుగంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సమాజ ఐక్యత, సేవాభావం, మరియు అభివృద్ధి పట్ల తమ కట్టుబాటును మరోసారి చాటిచెప్పిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY