కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట గ్రామంలో నిర్వహించిన శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి మరియు శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన స్వామి మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సమృద్ధితో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, శాంతి మరియు సాంప్రదాయ విలువలను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ పద్మరెడ్డి, ఎం. యాది రెడ్డి, విజయ్ గౌడ్, చింత సురేష్, ఆకుల యాదయ్య, చింత మల్లేష్, భుజంగ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నర్సింహా యాదవ్, బాల్రాజ్, జి. సత్యనారాయణ, ఎం. జంగారెడ్డి, నవీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధునోళ్ల సంజీవ రెడ్డి, మైసి గారి శ్రీనివాస్, శివ, గురువ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY