ఉజ్వల భవిష్యత్తుకు ఈ “పరాభవ నామ” సంవత్సర ఉగాది పండుగా తోడ్పడాలని ఆకాంక్షించిన– ఎమ్మెల్యే నాగరాజు …
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు “శ్రీ పరాభవ నామ సంవత్సర” ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని, కష్టాలు తొలగి ఆనందమయ జీవితానికి నాంది కావాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని, కొత్త ఆశలు, లక్ష్యాలు, ఆలోచనలకు ఇది నాంది పలుకుతుందన్నారు…
ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉజ్వల భవిష్యత్తు నెలకొని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని కోరుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల ద్వారా ప్రజల జీవితాల్లో సంతోషం పెరగాలని అభిలషించారు…
ఇక ఈ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగాల సంవత్సరం కావాలని ఆకాంక్షించారు…
ఈ “శ్రీ పరాభవ నామ సంవత్సరం”లో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఎమ్మెల్యే నాగరాజు ఆకాంక్షించారు…..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY