160,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) అందజేత
కూకట్పల్లి నియోజక వర్గం కూకట్పల్లి డివిజన్ లో నివాసం ఉంటున్న గంగాధర్ S/o భరత్ వయస్సు 54 సంవత్సరాలు పక్షవాతం సమస్యతో రాందేవ్ రావు ఆసుపత్రిలో హాస్పిటల్ లో చేరడం జరిగింది. భరత్ కూకట్పల్లి లోని గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కార్యాలయం లో సంప్రదించగా వారికి కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిది కి అప్లై చేయడం జరిగింది.. వారికి 160,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ మంజూరు అయ్యింది..
ఆ సీఎంఆర్ఎఫ్ లెటర్ ను కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ చేతుల మీదుగా రోజున శ్రీ హేమదుర్గ భవన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో గంగాధర్ కుమారుడు భారత్ కి అందజేయడం జరిగింది…
ఈ కార్యక్రమంలో ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, వెంకటేష్, పాల్గొన రావు, సలీం, అబ్దుల్లా, సాయి తులసి, బాలరాజు ,రవి, మోహన్ తదితరులు పాల్గొన్నారు…
ఈ సందర్భంగా భరత్ దంపతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కి కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు లకు కృతజ్ఞతలు తెలియజేశారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY