జాతిపిత విగ్రహానికి నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
అహింస అనే అయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భరతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో మహాత్మాగాంధీజీ ఒకరు అని అన్నారు. ఆయన మనకు అహింస, సత్యాగ్రహం అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసి, వాటిని వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. మహాత్మాగాంధీ ఆశయాలు, జీవన విధానం ప్రతి వ్యక్తికి ఆదర్శం అవ్వాలని అన్నారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, జిల్లా గణేష్, గోపాల్, CH.భాస్కర్, మల్లేష్, షౌకత్ అలీ మున్నా, కైసర్, నవాజ్, సుల్తాన్, ఖాజీమ్, ఇక్బాల్, మహమూద్, ఖాజా, లింగం, సుధాకర్, సత్తయ్య, షకీల్ మున్నా, రమేష్, రవీందర్, సత్యరాజు, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY