టిఆర్పి లో చేరికల జోరు – 34వ వార్డు నుంచి కీలక నాయకుల చేరిక
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర సూర్యాపేట పట్టణంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. పట్టణంలోని 34వ వార్డుకు చెందిన రఘుమోహన్, షేక్ జానిభాష, విజయ్ మోహన్, శ్రావణి తదితరులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తల నినాదాలు, ఉత్సాహంతో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీ అని తెలిపారు. గత 70–80 ఏళ్ల పాలనలో బహుజన వర్గాలకు తగిన న్యాయం జరగలేదని విమర్శించారు. అందుకే నేడు ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ చేరికలతో రాబోయే రోజుల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ప్రజల మద్దతుతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షులు బొల్లె సైదులు, పార్టీ నాయకులు కుంభం వెంకన్న తదితర కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY