31వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసిన మాజీ సర్పంచ్ యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు…
మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ల ఆశీస్సులతో విజయం సాధిస్తా..
సాక్షిత : *కుసుమ బాబు…..
కోదాడ మాజీ సర్పంచ్ యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు మునిసిపల్ ఎన్నికల్లో 31వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. గ్రామ పాలనలో తనకున్న అనుభవం, ప్రజాసేవ నేపథ్యం ఆధారంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిల ఆశీస్సులు, మద్దతుతోనే తాను ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు తెలిపారు. గతంలో సర్పంచ్‌గా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలే తనకు ప్రధాన బలమని ఆమె అన్నారు.31వ వార్డులో ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు. స్థానిక ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, మద్దతుతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు. కాగా నామినేషన్ కు ముందు ఆమె దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY