19వ వార్డులోమంచినీటి ఎద్దడిని తీర్చాలని కమిషనర్కు వినతిపత్రం అందజేసిన కౌన్సిలర్ మురళి సాగర్
సాక్షిత వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో మరి ముఖ్యంగా 19వార్డులో గత వారం రోజులుగా తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నదని అధికారులను సంప్రదిస్తే కరెంట్ సమస్య,లీకేజీల సమస్య వల్ల ఆలస్యం జరుగుతుందని చెబుతున్నారని వెంటనే సంబంధిత అధికారులు, సిబ్బంది స్పందించి మంచినీటీ సరఫరాసక్రమంగా జరిగేలా చూడాలని 19వార్డు కౌన్సిలర్ మురళీ సాగర్ కమిషనర్ను కోరుతూ వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగాది,రంజాన్ పండుగలు ఒకేసారి రావడం జరుగుతుంది అని కనీసం పండగల సమయములో నైనా మంచి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY