జన్మభూమి కాలనీ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జన్మభూమి కాలనీ లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జన్మభూమి కాలనీలో కొంతమేర డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కాలనీ లో కొన్ని చోట్ల విద్యుత్ స్తంబాలు కావాలని కాలనీ వాసులు కార్పొరేటర్ కి తెలియచేయగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే కరెంటు పోల్స్ అమర్చి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. డివిజన్ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, కాలనీలో పెండింగ్లో ఉండి అసంపూర్తిగా మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, బోయకిషన్, గోపాల్, పోశెట్టిగౌడ్, రెహ్మాన్, గోపి, గురుమూర్తి, కుమార్, తిరుపతి, మల్లేష్, నాగేష్, షేక్ షా వలి, గౌస్, నరసింహ రాజు, పెంటయ్య, బాలకృష్ణ, శేఖర్, ఆంజనేయులు, చందు, లాలు, గౌడ్, లింగం, సుధాకర్, సత్తయ్య, రమేష్, రవీందర్, ఖలీమ్.
జి.ఎచ్.ఎమ్.సి అధికారులు ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, UBD నాగరాణి, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ శివ, ఎస్.ఎఫ్.ఎ వెంకటరెడ్డి & మల్లేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY