నేటి యువతరం రాజకీయ నాయకులు లోకేష్ బాబు ని స్ఫూర్తిగా తీసుకోవాలి – మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ .
లోకేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా తోట్లవల్లూరు మండలం, వల్లూరు పాలెం లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ మరియు అన్న సమారాధన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజేంద్రప్రసాద్ .
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ….
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువత నారా లోకేష్ బాబు ని స్ఫూర్తిగా తీసుకోవాలని, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల పట్ల అంకితభావంతో ఉంటూ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అనుక్షణం ఆలోచించే వ్యక్తి లోకేష్ బాబు అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి , తోట్లవల్లూరు మండల పార్టీ అధ్యక్షులు వీరపనేని శివరాం, తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు చింతపల్లి వెంకటేశ్వరరావు, మర్రివాడ సర్పంచ్ పండు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY