కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 18 లో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 18 ప్రాంతంలో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ (నాలా) అభివృద్ధి పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక రావు తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఖుబా మజీద్ నుండి సర్వేనెంబర్ 18 వరకు జరుగుతున్న నాలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ నజీర్, జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY