మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు …
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ హసన్పర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గౌరిశెట్టి సత్యనారాయణ తల్లి గారైన గౌరిశెట్టి కనకలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….
అనంతరం 65వ డివిజన్ నిపూర్ నగర్ తండా కి చెందిన భూక్యా భీమా నాయక్ తండ్రి గారైన భూక్యా రాములు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు…
ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY