ప్రజలకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగ్గా అందించడమే ప్రభుత్వ లక్ష్యం….
ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, ఆరోగ్యం, క్రీడా వసతులు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి..
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని, వాస్తవాలు, పనులే తన పాలనకు నిదర్శనం..
అభివృద్ధి పనుల్లో నాణ్యతే ప్రధానమని, నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేపిస్తా..
రూ.1.కోటి 40 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు& డ్రైనేజ్, పైప్ లైన్, ఓపెన్ జిమ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కావ్య, మేయర్ సుధారాణి, ఎమ్మెల్యే నాగరాజు …
హన్మకొండ జిల్లా/ 66వ డివిజన్/ హసన్పర్తి..
వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నేడు 66వ డివిజన్ గాంధీ విగ్రహం సమీపంలో సుమారు రూ. 1 కోటి 20 లక్షల నిధులతో సీసీ రోడ్ & డ్రైనేజ్ నిర్మాణ పనులకు , విజయ గార్డెన్స్ సమీపంలో రూ. 14 లక్షల వ్యయంతో పైప్‌లైన్ పనులకు, అలాగే హసన్పర్తి పెద్ద చెరువు వద్ద రూ. 4.99 లక్షల నిధులతో ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-….
వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధి తమ జీవిత లక్ష్యమని, ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పాలన అందించడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు..
ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, ఆరోగ్యం, క్రీడా వసతులు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి డివిజన్‌లో సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి పైప్‌లైన్ పనులు, ఓపెన్ జిమ్‌లు వంటి ప్రజాపయోగ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు…
అభివృద్ధి పనుల్లో నాణ్యతే ప్రధానమని, నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు, అధికారులు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పనిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రజలకు నిజంగా ఉపయోగపడేలా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు..
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని, వాస్తవాలు, పనులే తన పాలనకు నిదర్శనమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే పాలన అందిస్తున్నామని చెప్పారు.
ప్రజల ఆశీర్వాదాలు, సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, డివిజన్, మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY