రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం..

Sakshitha news

రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం..

సాయి గ్రామర్ స్కూల్ అధ్యాపక బృందం ఘనంగా సత్కారం


సూర్యాపేట జిల్లా/చిలుకూరు, సాక్షిత : రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు అందుకున్న సలీం షరీఫ్‌ను చిలుకూరులోని సాయి గ్రామర్ స్కూల్ అధ్యాపక బృందం ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు మాట్లాడుతూ.. నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సలీం షరీఫ్‌ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్‌ను పెంచడంతో పాటు, ఎందరో ఉపాధ్యాయులకు బాసటగా నిలిచారని కొనియాడారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు దీప్తి, ఉమ, లావణ్య, అరుణ, ఇందిర, అనూష, ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.