కూచిపూడి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Sakshitha news

కూచిపూడి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనం ప్రారంభం

సూర్యాపేట జిల్లా / కోదాడ, సాక్షిత :

కూచిపూడి తండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. కోదాడ మండల పరిధిలోని కూచిపూడి తండాలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని బుధవారం స్థానిక సర్పంచ్ హాజీ నాయక్, గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.మహిళా సంఘా…