ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి
*లో వోల్టేజి సమస్యకు స్టేషన్ ద్వారా పరిష్కారం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
సూర్యాపేట జిల్లా/కోదాడ :(సాక్షిత : కోదాడ మండలం కూచిపూడి పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు కృషి చేస్తున్నట్లు కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నారు మండలం పరిధిలోని కూచిపూడి గ్రామంలో రూ.2.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూచిపూడి గ్రామ సర్పంచ్ కాసాని సంధ్యా వెంకటేశ్వర్లు లతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో కూచిపూడి, కాపుగల్లు, యతిరాజాపురం తండా పరిధిలోని ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. ముఖ్యంగా చాలాకాలంగా ఎదురవుతున్న లో ఓల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు గృహ, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.ఈ సబ్‌స్టేషన్ పరిధిలో మొత్తం 1,140 గృహ విద్యుత్ కనెక్షన్లు, 1,184 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రైతులకు సాగు అవసరాలకు, ప్రజలకు గృహ అవసరాలకు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST